Engagement : పెళ్లికి రెడీ అంటున్న పరిణీతి.. అతనితోనే ఎంగేజ్ మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engagement : కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తి గా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో సోషల్ మీడియాలో పరిణీతి, రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం వైరల్ అవుతోంది. పుకార్లకు నేటితో చెక్ పెట్టనున్నారు. పరిణీతి చోప్రా రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక మే 13న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది. సిక్కు ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ తో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
Read Also:Maharastra: భార్య మాటవిని.. మెచ్యూర్ అయిన చెల్లెల్ని కొట్టి చంపిన అన్న
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక కోసం నటి ప్రియాంక చోప్రా ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు, ఫొటోగ్రాఫర్స్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో ప్రియాంక లేత గోధుమరంగు స్వెట్‌షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లను ధరించింది. తలపై నల్లటి టోపీ, మ్యాచింగ్ షూస్, డార్క్ సన్ గ్లాసెస్ కూడా ధరించింది. భుజానికి నల్ల బ్యాగ్ వేసుకుని.. కారు వైపు వెళుతుండగా, ఆమె ఒక చిరునవ్వు నవ్వి… ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. దాంతో పాటు ఆమె తల ఊపుతూ ‘నమస్తే ‘ అని చెప్పి కారులో బయలుదేరింది. అంతకుముందు, ప్రియాంక లండన్ విమానాశ్రయంలో అభిమానులకు పోజులిచ్చిన పలు ఫొటోలు దిగింది. ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరి నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లకు సంబంధించి పలు ఫొటోలు బయటికొచ్చాయి. వీటిల్లో రాఘవ్ చద్దా ఇంటిని పువ్వులు, లైట్లతో అలంకరించారు. అంతకుముందు ముంబైలోని పరిణీతి ఇంటిని కూడా లైట్లతో అలంకరించారు.
Read Also:TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే
తాజావార్తలు
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!