Site icon NTV Telugu

Operation Sindoor: అంతర్జాతీయ ద్రవ్య నిధా లేక ‘ఉగ్రవాద నిధా’? పాక్ కు IMF నిధులు ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

Priyanka

Priyanka

భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత త్రివిధ దళాలు పాక్ ను చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి పాక్ కు లోన్ ఇవ్వడంపై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధినా లేక ఉగ్రవాద నిధా అంటూ పాక్ కు నిధుల విడుదలపై ఆమె మండిపడింది. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ తో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు సరైన బుద్ధి చెప్తోంది.

Also Read:Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఒక బిలియన్ డాలర్ల కొత్త రుణం పొందినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ రుణం గురించి శివసేన (UBT) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది IMF ను ఉగ్రవాద నిధుల సంస్థగా అభివర్ణించారు. IMF నుంచి పాకిస్తాన్ అందుకున్న నిధుల గురించి ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి పేరును అంతర్జాతీయ ఉగ్రవాద నిధిగా మార్చాలని ప్రియాంక అన్నారు. IMF ఒక ఉగ్రవాద దేశానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడానికి అవకాశం ఇస్తోంది. ఇది సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యింది.

Also Read:Operation Sindoor Live Updates: పాక్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు…

పాకిస్తాన్ డ్రోన్ దాడుల సంఘటనల తరువాత కచ్, జలంధర్ సహా సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత నెలకొంది. కచ్ జిల్లాలో పూర్తి విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. జలంధర్‌లో ముప్పు పొంచి ఉన్న తర్వాత, డిప్యూటీ కమిషనర్ మళ్ళీ విద్యుత్తు సరఫరా నిలిపివేతకు ఆదేశించారు. ఈ సంఘటనలకు ప్రతిస్పందనగా, భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల్లోని 30 కి పైగా విమానాశ్రయాలను మే 14 వరకు మూసివేసింది.

Also Read:Operation Sindoor: పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు.. ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా విరుచుకుపడిన భారత్..

భారత భద్రతా దళాలు పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి, వైమానిక దాడులను భగ్నం చేశాయి. శుక్రవారం సాయంత్రం, పాకిస్తాన్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని 26 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ దాడుల తర్వాత, జమ్మూ, సాంబా, రాజౌరి, నగ్రోటా, పూంచ్, అఖ్నూర్, ఉధంపూర్, బారాముల్లా, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్ వంటి నగరాలు ప్రభావితమయ్యాయి.

Exit mobile version