హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ యువ సంఘర్షణ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైబోలో తెలంగాణ అని ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక. మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. తెలంగాణ మీకు నేలకాదు, తల్లిలాంటిదని, నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. అంతేకాకుండా..’తెలంగాణలో కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నోత్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసిందికాదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. సోనియా తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదు. 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read : Railway Strike: రైల్వేలో సమ్మె సైరన్..!
ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. ఒక్క యూనివర్శిటీని కొత్తగా ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ స్కూల్స్‌లో చేరేవారి సంఖ్య తగ్గింది. మీ డబ్బులు అన్నీ ఎక్కడికిపోతున్నాయో ఆలోచించండి. రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా నెరవేర్చలేదు. టీఎస్పీఎస్సీ పేపర్‌లీక్ అయినా, ఎలాంటి చర్యలు లేవు. ప్రతి ఒక్కరిపై అప్పులభారం పడుతోంది. మీ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యాయో.. ఒక్కసారి ఆలోచించండి. నన్ను మరో ఇందిర అంటారు.. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్లైనా ఇందిరను తలచుకుంటున్నారంటే.. ఆమె అందించిన సేవలు అలాంటివి. ఈ సభావేదికపై ఉన్న నేతలంతా ఈ డిక్లరేషన్‌ను అమలు చేస్తారు. ఈ డిక్లరేషన్ అమలు చేయకపోతే మా సర్కార్‌ను కూల్చేయండి.’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : MK Stalin : తమిళనాడు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. ఆ మంత్రికి ఉద్వాసన
