Site icon NTV Telugu

Priyamani: 40ల్లోనూ సత్తా చాటుతున్న ప్రియమణి.. సినిమాల లైనప్ మాములుగా లేదుగా!

Priyamani

Priyamani

Priyamani: ఫేడౌట్‌ అయిందనుకున్న ప్రియమణి 40 ఏళ్ల వయసులో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా నటిచేస్తోంది ఈ భామ. 2017 నుంచి.. 2021 వరకు ఏడాదికి ఒకటీ అర సినిమాలే చేసిన ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్‌ అందుకుంటోంది. హీరోయిన్స్‌ పదేళ్ల కెరీర్‌ సాగించడమే అతి కష్టం. ఇక 20 ఏళ్లంటే.. మాములు మాటలు కాదు.. 2003లో తెలుగు సినిమా ‘ఎవరే అతగాడు’తో ఎంట్రీ ఇచ్చి.. 23 ఏళ్లుగా నటిస్తూ.. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీ అయిపోయింది.

India Post GDS Recruitment 2026: పోస్టల్ శాఖలో 28740 పోస్టులు.. 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష లేదు

కన్నడ బ్యూటీ ప్రియమణి రావన్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చినా.. జవాన్‌, ‘ఆర్టికల్‌ 370’ హిట్‌ కావడంతో ప్రియమణి పాపులర్‌ అయింది. సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ.. మూడేళ్లుగా తెలుగు, కన్నడ.. హిందీ అన్న తేడా లేకుండా నటిస్తోంది. 19 ఏళ్లకే కెమెరా ముందుకొచ్చిన ప్రియమణి.. 23 ఏళ్లుగా నటిస్తూనే వుంది. కెరీర్‌ మొదట్లో కంటే.. 40 ప్లస్‌లోనే మరింత పాపులర్‌ అయింది. ఈ వయసులో తనకున్న క్రేజ్‌కు హీరోయిన్‌గా సాగడం కష్టమేనన్న సంగతి ముందే పసిగట్టిన ప్రియమణి.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా యూ టర్న్‌ తీసుకుంది.

32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్‌ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై రూ.30,000 భారీ డిస్కౌంట్!

అందుకే కాబోలు భాషతో సంబంధం లేకుండా.. ఇంపార్టెంట్ రోల్స్‌ చేసుకుంటూ తనకంటూ క్రేజ్ క్రియేట్‌ చేసుకుంది. మన శంకరవరప్రసాద్‌ తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ప్రియమణి పేరు వినిపిస్తోంది. ఈ బంపర్‌ఆఫర్‌ కొడితే మాత్రం.. తెలుగులో మళ్లీ ప్రియమణి బిజీ కావడం ఖాయం.

Exit mobile version