NTV Telugu Site icon

Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!

Darling Trailer

Darling Trailer

Darling Movie Trailer Released: ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాకు అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. డార్లింగ్‌ను నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, లిరికల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డార్లింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది.

2 నిమిషాల 29 సెకండ్ల నిడివి గల డార్లింగ్ ట్రైలర్.. ‘ఆ అబ్బాయి చిన్నప్పటినుంచి అన్నిట్లో ఫస్ట్, మంది ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు’ అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ‘మంచి అమ్మాయిని పెళ్లి చేస్కుని పారిస్‌కి హనీమూన్ తీసుకెళ్తా మిస్’. ‘బలైపోయే మేకకు బలుపెక్కువట’ , ‘దీనమ్మ.. పెద్ద మహానటిరా ఇది’, ‘నా పెళ్లాం బెల్లం రా’ అనే డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ప్రియదర్శి కామెడీ టైమింగ్ చాలా బాగుంది.

Also Read: Jon Landau Death: హాలీవుడ్‌లో విషాదం.. టైటానిక్‌, అవతార్‌ చిత్రాల నిర్మాత కన్నుమూత!

డార్లింగ్ సినిమాలో అనన్య నాగ‌ళ్ల‌, శివా రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్, క‌ళ్యాణీ రాజ్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. హనుమాన్‌ తర్వాత చైతన్య, నిరంజన్‌ రెడ్డిల సంయుక్త నిర్మాణం నుంచి డార్లింగ్‌ వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నభా నటేష్‌కు ఈ విజయం కీలకం కానుంది.

Show comments