ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్ను గీటు వీడియో తో ప్రియా ప్రకాష్ వారియర్ బాగా పాపులర్ అయింది.. దీంతో సౌత్ సినిమాల తో పాటు నార్త్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది..ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా అలరించింది..తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ భామ అవకాశాలు సొంతం చేసుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది.ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ చిత్రీకరణ దశ లో ఉన్నాయి.. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్ ఎంతగానో అలరిస్తుంది.
ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ వేకేషన్ లో ఉంది. బ్యాంకాక్ లో స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్ల లో కనిపించి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల ను బాగా ఆకట్టుకుంటోంది. ఆ పిక్స్ ను సోషల్ మీడియా లో పంచుకుంది.బ్యాంకాక్ లోని వీధులన్నీ తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఫొటోల కు ఫోజులిస్తూ బాగా అట్రాక్ట్ చేసింది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక ప్రియా వారియర్ నటించిన మలయాళ చిత్రం తెలుగులో ‘లవర్స్’ గా విడుదలైంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.తెలుగులో రెండు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ భామ తెలుగులో నితిన్ సరసన ‘చెక్’ సినిమాలో నటించింది అలాగే యంగ్ హీరో తేజ సజ్జతో ‘ఇష్క్’సినిమా లో కూడా నటించింది. ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో : ది అవతార్’తో నటించి మెప్పించింది. ఈ సినిమా తో అయినా ఈ భామ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయో లేదో చూడాలి..