Aircraft Crash: మరో ప్రమాదం.. చెట్లను ఢీకొట్టి కూలిన విమానం..

  • మరో ఘోర విమాన ప్రమాదం
  • చెట్లను ఢీకొట్టి కూలిన విమానం
  • ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో
Flight Accident

Flight Accident

వరల్డ్ వైడ్ గా చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం విమాన ప్రమాదం జరిగింది. ఆరా కొండల్లో ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. గ్రామస్థుల కథనం ప్రకారం, జష్‌పూర్‌లోని నారాయణ్‌పూర్ ప్రాంతంలోని రతన్‌పహలి అడవిలో ఈ చార్టర్డ్ విమానం చెట్లను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత, ఆ కొండ ప్రాంతం నుండి మంటలు, పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. విమానంలో ఎంతమంది ఉన్నారనేది ప్రస్తుతం తెలియరాలేదు.