Site icon NTV Telugu

Aadujeevitham: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘ఆడు జీవితం’.. 25 రోజుల్లోనే..!

Aadujeevitham

Aadujeevitham

Prithviraj Sukumaran’s Aadujeevitham Movie Collections మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించిన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్‌). సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ ఇతి వృత్తంతో వచ్చిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఆడు జీవితం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూల్ చేసింది. మలయాళంలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలోకి ఆడు జీవితం చేరింది.

ఈ సినిమా విజయంపై పృథ్వీరాజ్‌ సుకుమార‌న్ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేస్తూ సినిమాని ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘ది గోట్‌ లైఫ్‌ కొత్త శిఖరాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. మీ అచంచలమైన ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు’ అని పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ ఆడు జీవితం. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన నజీబ్‌.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెబుతూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ను రచించారు. 2008లో ఈ న‌వ‌ల అత్యధికంగా అమ్ముడైంది.

Also Read: Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సచిన్ ట్వీట్ వైరల్!

గోట్‌ డేస్‌ను సినిమాగా తీయాలనే ఆలోచనతో డైరెక్టర్ బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ఆడు జీవితంను ఆయన తెరకెక్కించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఏకంగా 31 కిలోల బరువు తగ్గారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటల పాటు భోజనం లేకుండా.. కేవలం మంచి నీళ్లు, బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగారు. అంతలా కష్టపడిన పృథ్వీరాజ్‌కు మంచి విజయమే దక్కింది. సలార్ విజయం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

 

Exit mobile version