NTV Telugu Site icon

Prithvi Shaw: పృథ్వీ షాకు ఏమైంది..?

Prithvi Shaw

Prithvi Shaw

Prithvi Shaw: భారత జట్టు ఓపెనర్ పృథ్వీ షా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. పృథ్వీ షా ఇటీవల ఓ మోడల్‌తో వివాదం కారణంగా వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వివాదం చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ.. పృథ్వీ దీనిపై ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. చిన్న వయసులోనే భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. మళ్లీ టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడే అవకాశం రాలేదు.

కాగా, కొద్ది రోజుల క్రితం పృథ్వీ షా భారత జట్టులో అవకాశం రాకపోవడంపై స్పందించాడు. టీమ్ ఇండియాకు ఆడటం తనకు చాలా ముఖ్యం. తను ఈ టీమ్ ఇండియాతో ఏమి సాధించాలనుకుంటున్నాను అనే జాబితాను తయారు చేసాను అని షా అన్నారు. జట్టులో అవకాశం కోసం తాను ఎదురు చూస్తున్నానని అతను చెప్పాడు.ట్వంటీ 20కి తిరిగి వచ్చిన తర్వాత, చాలా బాగున్నాను అని పృథ్వి షా వెల్లడించారు. కానీ.. నాకు జట్టులో ఆడే అవకాశం రాలేదు.. కానీ పునరాగమనం చాలా ముఖ్యమంటు షా తెలిపారు. ఇప్పుడు తన ఇన్ ష్టా గ్రామ్ అకౌంట్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి అభిమానుల దృష్టిని పృథ్వీ షా ఆకర్షించాడు.

Read Also: Shubman Gill: రష్మిక.. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు

ప్రస్తుతం రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న పృథ్వీ షా ఎమోషనల్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఉంచారు. స్టోరీ ద్వారా పృథ్వీ మాట్లాడుతూ, కొంతమంది నిన్ను ప్రేమిస్తారు.. వారు మిమ్మల్ని ఉపయోగించుకునేంత వరకు.. వారి ప్రయోజనాలు ఎక్కడ ముగుస్తుందో అక్కడ వారి విధేయత ముగుస్తుంది.. కొంతమంది అవసరాన్ని బట్టి మాత్రమే ప్రేమిస్తారని పృథ్వీ షా చెప్పారు.

నిజానికి పేలవమైన ఫామ్, నిషేధిత పదార్థాల వినియోగం కారణంగా పృథ్వీ షా చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు రంజీ ట్రోఫీలలో గట్టి ప్రదర్శనతో అతను తిరిగి జట్టులోకి వచ్చాడు. పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 363, రంజీ ట్రోఫీలో 379 పరుగులు చేశాడు. టీమిండియా జట్టులో తనకు స్థానంలో లభించకపోవడంతోనే ఈ పోస్ట్ చేసినట్లు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా పృథ్వీ షాను తిరిగి భారత జట్టులో ఆడించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Show comments