NTV Telugu Site icon

Prithvi Shaw Double Century: డబుల్ సెంచరీ చేసినా.. టీమిండియాలో చోటు గురించి ఆలోచించడం లేదు: పృథ్వీ షా

Prithvi Shaw

Prithvi Shaw

Prithvi Shaw Hits Double Century for Northamptonshire: ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా అదరగొట్టాడు. నార్తంప్టన్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల షా.. డబుల్ సెంచరీతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 153 బంతులు ఆడి.. 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు చేశాడు. షా అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్‌ చేసిన నార్తంప్టన్‌షైర్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 రన్స్ చేసింది. ఆపై సోమర్‌సెట్‌ 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది. డబుల్ సెంచరీ చేసిన షా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

తాజాగా జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై పృథ్వీ షా స్పందించాడు. టీమిండియాలోకి తీసుకొనే విషయంలో సెలక్టర్ల అభిప్రాయంపై తాను ఏమాత్రం బాధపడటంలేదన్నాడు. ‘బీసీసీఐ సెలక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ సమయాన్ని ఆద్భుతంగా ఆస్వాదించాలనుకుంటున్నా. ఆటగాళ్లు, సపోర్టింగ్‌ స్టాఫ్‌తో చక్కటి సమయం గడుపుతున్నా. నార్తంప్టన్‌షైర్‌ నాకు అవకాశం ఇచ్చింది. వారు నన్ను బాగా చూసుకుంటున్నారు. ఆటను ఎంజాయ్‌ చేస్తున్నా. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా’ అని షా చెప్పుకొచ్చాడు.

Also Read: Tilak Varma CWC 2023 Chances: ప్రపంచకప్‌ 2023 జట్టులో తిలక్ వర్మకు చోటు.. మనోడికి కలిసొచ్చే అంశాలు ఇవే!

యువ క్రికెటర్‌ పృథ్వీ షా భారత్ తరఫున మ్యాచ్ ఆడక చాలా రోజులు అయింది. జులై 2021 తర్వాత అతడు భారత జట్టు తరపున బరిలోకి దిగలేదు. షా భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో ఆడాడు. అయితే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యాడు. త్వరగా పెవిలియన్ చేరి.. మూల్యం చెల్లించుకున్నాడు. పృథ్వీ షా భారత్ తరఫున 5 టెస్టులు, 6 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 339, వన్డేల్లో 189 రన్స్ చేసిన షా.. ఒక టీ20 మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో షా ఓకే సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు.

 

Show comments