రోజూ ఎక్కడో ఒక చోట స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. పనిచేసే చోట, చదవుకునే చోట, చదువు నేర్పే చోట.. ఇలా ఒక్కటేమిటి.. గుడి, బడి అని తేడా లేకుండా.. ఎక్కడపడితే అక్కడ కామాంధులు రెచ్చిపోతున్నారు. తమలో ఉన్న కామవాంఛ తీర్చుకోవడానికి చిన్న పెద్దా తేడా లేకుండా.. ఉన్నతస్థాయిలో ఉండి కూడా.. అవివేకంగా ప్రవర్తిస్తు్న్నారు. అయితే.. కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. శిక్షలు తమకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చదువుకోవడానికి వచ్చిన విద్యార్థినులపై కన్నేసి.. తమ కామవాంఛ తీర్చుకుంటున్న కీచక ఉపాధ్యాయుల గురించి ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే సంగారెడ్డిలో చోటు చేసుకుంది.
Also Read : బాలీవుడ్‌లో ఘనంగా కర్వా చౌత్.. ఫోటోలు వావ్
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. అయితే.. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని.. ఈనెల 11న వేధింపులు తట్టుకోలేక హాస్టల్ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా.. తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. దీంతో సదురు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో విద్యార్థిని చికిత్స పొందుతోంది.