NTV Telugu Site icon

PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు

Prime Minister

Prime Minister

ప్రధాని నరేంద్ర మోడీ కువైట్‌లోని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంపును సందర్శించారు. అక్కడున్న భారతీయ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా, భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉందన్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో మాట్లాడాలనుకుంటే, ఖర్చు చాలా తక్కువ అని ప్రధాని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా తక్కువే అని తెలిపారు.

నేను కూడా 12 గంటలు పని చేస్తాను – ప్రధాని మోడీ
“నేను అభివృద్ధి చెందిన భారతదేశం 2047 గురించి మాట్లాడుతున్నాను. అప్పటి వరకు సుదూర ప్రాంతాల నుంచి పని చేయడానికి వచ్చిన మీరు కూడా మీ గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం. మన రైతులు ఎంత కష్టపడుతున్నారో రోజంతా ఆలోచిస్తూ ఉంటాను. పొలాల్లో మన కూలీలు ఎంత కష్టపడి పని చేస్తారు. వీళ్లంతా 10 గంటలు పని చేస్తే నేను కూడా 11 గంటలు పని చేయాలి అనిపిస్తుంది. వాళ్ళు 11 గంటలు పనిచేస్తే నేను కూడా 12 గంటలు పని చేయాలని ఉంటుంది. రెండవది మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నారా లేదా? నేను కూడా నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. మా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ కష్టపడి పని చేయాలి.” అని  ప్రధాని తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు కాదు..
“నాకు అభివృద్ధి అంటే మంచి రోడ్లు, మంచి విమానాశ్రయాలు, మంచి రైల్వే స్టేషన్లు మాత్రమే కాదు. నిరుపేదలకు కూడా వారి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని కోరుకుంటున్నా. 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడమే మా లక్ష్యం. పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. ఇప్పటి వరకు 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. అందులో కనీసం15-16 కోట్ల మంది అందులో నివసిస్తారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు కృషి చేస్తున్నాను.” అని మోడీ వెల్లడించారు.