Site icon NTV Telugu

Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?

Modi

Modi

గత కొన్నేళ్లుగా ఇండియాన్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ఎందరో స్వతంత్ర సమరయోధులు, క్రిడారంగంలో స్టార్స్ గా రాణించిన ప్లేయర్స్, సింగర్స్, నటీమణులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు   ఇలా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖుల బయోపిక్ లు వెండితెరపై వచ్చాయి. కొని సినిమాలు సూపర్ హిట్స్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయి. మరికొందరి బయోపిక్ లు షూటింగ్స్ దశలో ఉన్నాయి.

Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా భారతప్రధాని నరేంద్రమోడీ లైఫ్ జర్నీని తెలియజేస్తూ బయోపిక్ రాబోతుంది. నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా గతంలో ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే బయోపిక్ వచ్చింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ బయోపిక్ ను భారీ టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ పై నిర్మించేందకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నాడు. జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి తెలుగు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు భారత ప్రధాని బయోపిక్ లో నరేంద్ర మోడీగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను క్రాంతి కుమార్ సిహెచ్ దర్శత్వం వవహిస్తుండగా బాహుబలి డివోపి కేకే సెంథిల్, KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. నేడు ప్రధాని పుట్టిన రోజు కానుకగా ప్రకటించ నున్న ఈ సినిమాకు ‘ మా వందే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.

Exit mobile version