Narendra Modi Biopic : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్.. టైటిల్ ఇదే.. హీరో ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా ఇండియాన్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ఎందరో స్వతంత్ర సమరయోధులు, క్రిడారంగంలో స్టార్స్ గా రాణించిన ప్లేయర్స్, సింగర్స్, నటీమణులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖుల బయోపిక్ లు వెండితెరపై వచ్చాయి. కొని సినిమాలు సూపర్ హిట్స్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయి. మరికొందరి బయోపిక్ లు షూటింగ్స్ దశలో ఉన్నాయి.
Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్
Also Read
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
ఇక ఇప్పుడు లేటెస్ట్ గా భారతప్రధాని నరేంద్రమోడీ లైఫ్ జర్నీని తెలియజేస్తూ బయోపిక్ రాబోతుంది. నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా గతంలో ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే బయోపిక్ వచ్చింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ బయోపిక్ ను భారీ టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్ పై నిర్మించేందకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాని మోడీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నాడు. జనతా గ్యారేజ్, భాగమతి, యశోద వంటి తెలుగు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు భారత ప్రధాని బయోపిక్ లో నరేంద్ర మోడీగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను క్రాంతి కుమార్ సిహెచ్ దర్శత్వం వవహిస్తుండగా బాహుబలి డివోపి కేకే సెంథిల్, KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. నేడు ప్రధాని పుట్టిన రోజు కానుకగా ప్రకటించ నున్న ఈ సినిమాకు ‘ మా వందే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!