NTV Telugu Site icon

Mann Ki Bath: ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగం..లోక్ సభ ఎన్నికల ప్రస్తావన

New Project (49)

New Project (49)

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రస్తావించారు. మన రాజ్యాంగం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమకున్న అచంచల విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు ఈరోజు దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని.. 2024 ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు.. ఇంత పెద్ద ఎన్నికలు ఏ దేశంలోనూ జరగలేదన్నారు.

READ MORE: Pemmasani: రాబోయే ఖరీఫ్ సీజన్కు కార్యాచరణ రూపొందించాలి..

అనంతరం ఆయన చరిత్ర గురించి మాట్లాడుతూ.. ‘హూల్ డే’ గురించి చెప్పారు. “ఈ రోజు, జూన్ 30 చాలా ముఖ్యమైన రోజు. మన గిరిజన సోదరులు.. సోదరీమణులు ఈ రోజును ‘హల్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజు పరాయి పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్య సిద్ధో-కణ్హు అలుపెరగని ధైర్యసాహసాలతో ముడిపడి ఉంది. ఆయన నాటి దారుణాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ధైర్యవంతులైన సిద్ధో-కణ్హు వేలాది మంది సంతాలీ సహచరులను ఏకం చేసి, బ్రిటిష్ వారితో పోరాడారు. జార్ఖండ్‌లోని సంతాల్ పరగణాలో మన గిరిజన సోదరులు.. సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారు. ” అని గుర్తుచేశారు.

READ MORE: Tripura : అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 11మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

అనంతరం ప్రధాని మోడీ తన తల్లిని ప్రస్తావిస్తూ..”ప్రపంచంలో అత్యంత విలువైన బంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే, మీరు ఖచ్చితంగా అమ్మ అని చెబుతారు. మనందరి జీవితంలో ‘అమ్మ’కి అత్యున్నత స్థానం ఉంది. ప్రతిదాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డను పోషిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డకు తన ప్రేమను అందజేస్తుంది. ఇది మనందరికీ రుణం లాంటిది.” అని తన తల్లిని గుర్తుచేసుకున్నారు.