NTV Telugu Site icon

PM Modi: వారణాసిలో ప్రధాని మోడీ గెలుపు.. ఎంత మెజార్టీనో తెలుసా..!

Modi

Modi

2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత హాట్‌స్టేట్ సీట్లలో ఒకటైన వారణాసి సీటు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి మూడోసారి గెలుపొందారు. కాగా.. ఈరోజు వారణాసిలో కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత.. పుంజుకోగా 1.5 లక్షలకు పైగా ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.

Read Also: CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే.. వారణాసిలో మోడీ గెలిచినప్పటికీ, బీజేపీ టెన్షన్ లో పడింది. ప్రధాని స్థాయి వ్యక్తి ఓట్లు తగ్గడం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. మోడీ రాజకీయ స్థాయిని బట్టి ఆయన గెలుపును ఎక్కువగా అంచనా వేస్తారు. కానీ.. తక్కువ మెజార్టీతో గెలువడంపై బీజేపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. కాగా.. 2019 ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలుపొందగా.. ఈసారి కేవలం లక్షా 52 వేల 513 ఓట్లతో విజయం సాధించారు.

Read Also: Yusuf Pathan: ఆన్ ఫీల్డే కాదు ఆఫ్ ఫీల్డ్ లో కూడా విజయం సాధించిన టీమిండియా ఆటగాడు..

ప్రధాని మోడీపై భారత కూటమికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీలో నిలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అజయ్‌రాయ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వారణాసి నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.