Site icon NTV Telugu

Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!

Mud

Mud

శుక్రవారం ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా రానున్నారు. ఇందుకోసం ముంబైలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక అతిథులను పెళ్లి మండపం దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Amarcontact Express: అమర్‌కంటక్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం..ఎక్కడంటే..?

ఇక అనంత్-రాధిక వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. కుమారుడి పెళ్లికి రావాలని ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలను, దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించారు. దీంతో ఈ వివాహానికి హాజరయ్యేందుకు రాజకీయ ప్రముఖలంతా వస్తున్నట్లు సమాచారం. ఇక ప్రధాని మోడీ శుక్రవారం ముంబై రాబోతున్నట్లు సమాచారం. మోడీతో పాటు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, శివరాజ్ సింగ్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: SKN: మాటిచ్చాడు.. ఆటో కొనిపెట్టాడు..ఎస్కేఎన్ వీడియో వైరల్

Exit mobile version