పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్‌డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు.
Read Also: Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
ప్రధాన మంత్రి ఫోన్ కాల్లో నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ.. “మరోసారి దేశం గర్వపడేలా చేసావు. రాత్రి ఒంటి గంట సమయంలో కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజలు మీ ఆటను చూశారు,” అని మోడీ కొనియాడారు. ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నప్పటికీ.. నిలకడగా ప్రదర్శన చేయడం అభినందనీయమన్నారు. గాయాల కారణంగా బంగారు పతకం సాధించలేదని నీరజ్ వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల్లోనూ దేశానికి పతకం సాధించడం సంతోషంగా ఉందని, క్రీడల్లో ఎత్తుపల్లాలు ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్ లో మరింత శ్రమిస్తానని నీరజ్ చోప్రా తెలిపాడు.
Read Also: AMGEN: హైదరాబాద్లో మరో అతి పెద్ద కంపెనీ.. వేలల్లో ఉద్యోగావకాశాలు
స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో పతకం సాధించగలిగాడు. స్వతంత్ర భారతంలో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. తన అత్యుత్తమ ప్రదర్శనతో 89.45 మీటర్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయుడు నీరజ్. కాగా.. తాజాగా జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో అర్షద్ 92 మీటర్ల మార్క్‌ను తాకగా.. నీరజ్ 89.45 మీటర్లు విసిరాడు. కాగా.. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పసిడి పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.