Site icon NTV Telugu

PM Modi: లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు..

Modi

Modi

శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ.. జయ రామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. అనంతరం.. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రధాని మోదీకి లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ అధికారులు, పూజారులు.. ఆలయ స్థల పురాణాన్ని తోలు బోమ్మలాట ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ.

Maruti Suzuki: షాక్ ఇచ్చిన మారుతి సుజుకీ.. అన్ని కార్ మోడళ్ల ధర పెంపు..

పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఆవరణలోనే సోలార్‌ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు.

YS Sharmila: పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల నియామకం.. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటన

Exit mobile version