NTV Telugu Site icon

PM Modi: ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..

Modi

Modi

అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.

CM Jagan: ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి..

మరోవైపు.. రైల్వేజోన్ కేటాయించిన నిర్మాణాలకు అవసరమైన భూములు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ఉత్తరాంధ్ర సృజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇస్తున్నాను.. ఇథనాల్ ప్లాంట్ నిర్మాణాలు చేపడతామన్నారు. మరోవైపు.. అనకాపల్లి ప్రాంతంలో చెరకు రైతులు ఆందోళనలో ఉన్నారని.. ఫ్యాక్టరీలు మూతపడ్డాయని తెలిపారు.

Asha Sobhana Debut: 13 ఏళ్ల వ‌య‌స్సులో క్రికెట్ వైపు అడుగులు.. 33 ఏళ్లకు భారత జట్టులో అరంగేట్రం!

కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల విధానం ఒక్కటే.. వాళ్ళకు గుర్తింపు అవినీతి అని ప్రధాని ఆరోపించారు. ఏపీలో ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా రాజ్యం ఏలుతున్నాయని పేర్కొన్నారు. ఈ దోపిడీ నుంచి విముక్తి కోసం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కాంగ్రెస్, వైసీపీల వల్ల విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తిరస్కరిస్తే.. ఆంధ్రాలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాను.. ఏపీ సంస్కృతిని కాపాడే బాధ్యను బీజేపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓట్లు మోడీని బలపరుస్తుందని తెలిపారు.