NTV Telugu Site icon

PM Modi: హైదరాబాద్కు ప్రధాని మోడీ.. నగరంలో హైఅలర్ట్..

Pm Modi

Pm Modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇక, ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంత కుమారి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే, భారీ బందోబస్తు మధ్య బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు ప్రధాని మోడీ బయలు దేరి వెళ్లారు.

Read Also: The Family Star: కలియుగ రాముడు వచ్చిండు కాకో… మడతపెట్టి కొడితే?

అయితే, ఇవాళ ఉదయం అదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ సభ అనంతరం నేరుగా చెన్నై వెళ్లారు. చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇక, రేపు సంగారెడ్డి పర్యటనలో భాగంగా నేటి రాత్రికి హైదరాబాద్ నగరంలోని రాజ్ భవన్ లో ప్రధాని బస చేయనున్నారు. ఇక, ప్రధాని మోడీ రాకతో బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వరకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: Mahua Moitra: మహువా మొయిత్రాకు మళ్లీ ఈడీ సమన్లు..

ఇక, ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం వరకు రాజ్ భవన్ పరిసరాల్లో హై అలెర్ట్ తో పాటు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ప్రధాని పర్యటన ఆలస్యం అయింది. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు.