NTV Telugu Site icon

PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం

Pm Modi

Pm Modi

ఈ రోజు ప్రధాని మోడీ 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. టాటానగర్ స్టేషన్‌లో కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, అన్నపూర్ణాదేవి, సంజయ్ సేథ్‌లతో పాటు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ రైళ్లతో కనెక్టివిటీ, సురక్షితమైన ప్రయాణం, ప్రయాణికుల సౌకర్యాలు పెరుగుతాయని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత వాటి సంఖ్య 54 నుండి 60కి పెరిగింది. ఈ విధంగా వందే భారత్ రైళ్లు రోజుకు 120 ట్రిప్పుల ద్వారా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 280 కంటే ఎక్కువ జిల్లాలను కవర్ చేస్తున్నాయి.

Read Also: Bihar: పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైల్ ఇంజన్.. తప్పిన ప్రమాదం

కొత్తగా ప్రారంభించిన రైళ్లు.. టాటానగర్-పాట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోఘర్-వారణాసి, భాగల్పూర్-హౌరా మరియు గయా-హౌరా మార్గాల్లో నడుస్తాయి. దీంతో.. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కాగా.. మొదటి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Read Also: Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2024 సెప్టెంబర్ 14 వరకు 54 రైళ్లతో (ఆన్-డౌన్‌లతో సహా 108 ట్రిప్పులు) మొత్తం 36,000 ప్రయాణాలను పూర్తి చేసింది. 3.17 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చాయి. మరోవైపు.. వందే భారత్ రైలు సెట్ ఇప్పుడు వందే భారత్ 2.0గా రూపాంతరం చెందింది. ఈ రైలు వేగం, కవచం, యాంటీ-వైరస్ సిస్టమ్, వైఫై వంటి అధునాతన ఫీచర్‌లను కలిగి ఉంది. మరోవైపు.. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. వందే భారత్ పోర్ట్‌ఫోలియో నిరంతరం విస్తరిస్తోంది. మెరుగైన కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లను అందులో చేర్చారు. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద దేశీయంగా రూపొందించిన ఈ రైలు లక్షలాది మంది ప్రయాణికులకు లగ్జరీ, అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది.

Show comments