NTV Telugu Site icon

PM Modi: దర్యాప్తు సంస్థలపై విపక్షాల విమర్శలకు మోడీ కౌంటర్

Lok Sabha

Lok Sabha

కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోడీ (PM Modi) తిప్పి్కొట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోడీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదని తేల్చి చెప్పారు.

 

రాజకీయాలకు వాడుకుంటారా?
కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని మోడీ విమర్శించారు. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో (Congress) ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్‌ చేసిందని.. అదే మా హయాంలో రూ.లక్ష కోట్ల అక్రమ నగదు సీజ్‌ చేసినట్లు గుర్తుచేశారు. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని.. వాటిపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తు్న్నాయంటూ మండిపడ్డారు. తమ హయాంలో దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేస్తున్నాయని కితాబు ఇచ్చారు. స్వతంత్రంగా పని చేస్తున్న సంస్థలపై ఆరోపణలు సరికాదని.. అవినీతిని అంతం చేసేంత వరకూ విశ్రమించేది లేదని ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో ఎన్డీయే ఎంపీలంతా (NDA MPs) నిలబడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి:Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్