స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ కావున.. ఇటు అభిమానులతో పాటు, అటు ఆటగాళ్లకు కప్ కొట్టాలనే ఆశ ఉండేది. కానీ నిన్న జరిగిన ఘోర పరాజయంతో అభిమానులు, ఆటగాళ్ల ఆశలు నిరాశలయ్యాయి. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియా.. చివరకు ఫైనల్స్ లో ఓడి చెప్పుకోలేని బాధతో తీవ్ర ఆవేదన చెందారు.
Read Also: Tragedy: సాంబార్ గిన్నెలో పడి రెండో తరగతి బాలిక మృతి
ఈ క్రమంలో.. అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. పైకి నవ్వుతూ కనిపించిన ఆటగాళ్ల ముఖాలు.. లోపల మాత్రం గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చిందుకే ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర విచారణలో ఉన్న మహమ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. అంతేకాకుండా.. వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని కాస్త నిమ్మలం చేశారు.
Read Also: Monkey Attack: నదిలో స్నానం చేస్తున్న జంటపై కోతి దాడి.. యువతి ఏం చేసిందో తెలుసా..!
అయితే దీనికి సంబంధించిన ఫొటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ” ఈ టోర్నీ టైటిల్ గెలుస్తామనే ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. కానీ దురదృష్టవశాత్తు కలిసి రాలేదు. టీమిండియాకు, నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి మాలో స్ఫూర్తిని ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేం తప్పకుండా పుంజుకుంటాం” అని షమీ ట్వీట్ చేశాడు.