Site icon NTV Telugu

Prime Minister Modi: రికార్డు సృష్టించిన ప్రధాని.. మోడీకి ఎక్స్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్..

Pm Modi

Pm Modi

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. మోడీ “ఎక్స్” ఖాతాలో 100 మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను దాటారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నాయకుడిగా నిలిచారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా నరేంద్ర మోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విషయంలో ఇతర నాయకులు చాలా వెనుకబడి ఉన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి 26.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 27.5 మిలియన్లు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్‌కు 19.9 మిలియన్లు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను 6.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

READ MORE: Crime News: కట్టుకున్నోడే కడతేర్చాడు.. రఘునాథపాలెం రోడ్డు ప్రమాద ఘటనలో వీడిన మిస్టరీ

మోడీ ఫాలోయింగ్ పరంగా భారతీయ నాయకుల కంటే ముందుండటమే కాదు.. విదేశీ నాయకులలో కూడా ముందున్నారు. సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, పలువురు విదేశీ నేతలు మోడీ కంటే చాలా వెనుకబడి ఉన్నారు. జో బిడెన్‌కి ప్రస్తుతం 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రధాని మోడీ ఎక్స్ ఖాతాలో గత మూడేళ్లుగా దాదాపు 30 మిలియన్ల ఫాలోవర్స్ ను పెరిగారు. ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది ప్రజలు ఆయనను అనుసరిస్తున్నారు. మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.2 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 49 మిలియన్ల మంది, యూట్యూబ్‌లో 24.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో వాట్సాప్ ఛానెల్‌లో కూడా 13 మిలియన్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు.

Exit mobile version