President Draupadi Murmu AP Tour: నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Draupadi Murmu AP Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు రాష్ట్రపతి.. నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది.. సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది సత్యసాయి డీమ్డ్ వర్సిటీ.. అయితే, ఆ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.. ఇక, ఈ కార్యక్రమానికి గవర్నరు అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పతకాలు అందించనున్నారు.
Read Also: Kollapur: కొల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడిపై దాడి
Also Read
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
సత్యసాయి జిల్లా పర్యటన కోసం రాష్ట్రపతి మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకోనున్నారు.. ఇక, 3.05 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు స్నాతకోత్సవంలో విద్యార్థులకు డాక్టరేట్లు, బంగారు పతకాలు అందజేయనున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఇక, రాష్ట్రపతి, గవర్నర్ పర్యటన దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేశారు అధికారలు.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. కింది టేబుల్ లో చూడవచ్చు…

తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!