Delhi: మెట్రోలో రాష్ట్రపతి పర్యటన.. సడన్ ఎంట్రీతో షాకైన ప్యాసింజర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ప్రథమ పౌరురాలు ఢిల్లీ మెట్రోలో (Delhi Metro) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సామాన్యురాలిలో ప్రయాణికులతో కలిసి కూర్చుని జర్నీ చేయడంతో ప్యాసింజర్స్ అంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఎలాంటి హడావుడి.. హంగామా లేకుండా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మెట్రో రైలు ఎక్కి ప్రయాణించారు. అంతేకాకుండా విద్యార్థుల ప్రక్కన కూర్చుని వాళ్లతో ముచ్చటించారు. రైల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan)కు సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌ను తొలుత ద్రౌపదీ ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా మెట్రో పనితీరు, ఇతర వివరాలను మెట్రో అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనంతరం కొంతదూరం మెట్రో ట్రైన్లో ప్రయాణించారు. సడన్‌గా రాష్ట్రపతి మెట్రో రైలు ఎక్కడంతో ప్రయాణికులు అవాక్కైయ్యారు.
Also Read
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
ఇదిలా ఉంటే అమృత్ ఉద్యాన్‌గా పేరు మార్చిన మొఘల్ గార్డెన్స్‌తో పాటు రాష్ట్రపతి భవన్‌లోని ఇతర ఉద్యానవనాలను ప్రజలు సందర్శించేందుకు అవకాశం కల్పించారు. మార్చి 31 వరకు ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. దీని సందర్శనకు వెళ్లే పర్యటకుల కోసం ఢిల్లీ మెట్రో ఉచిత సేవలు ప్రారంభించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నాలుగో గేటు నుంచి ప్రయాణికులు ఉచితంగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లొచ్చని తెలిపింది.
#WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ
— ANI (@ANI) February 7, 2024
President Droupadi Murmu takes ride in Delhi Metro@rashtrapatibhvn @DCP_DelhiMetro pic.twitter.com/2j1bvec466
— DD News (@DDNewslive) February 7, 2024
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!