Indian Constitution: గుడ్‌న్యూస్.. తెలుగు సహా.. 9 భాషల్లో రాజ్యాంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Constitution: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు సులువుగా అర్థం చేసుకునే రోజు వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగాన్ని తొమ్మిది భాషలలో డిజిటల్‌గా విడుదల చేశారు. తెలుగు భాష సహా.. మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళంలో రాజ్యాంగాన్ని అనువాదించారు. ఈ రోజు మొత్తం దేశం రాజ్యాంగ నిర్మాతలకు గౌరవం ఇచ్చే రోజు అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
READ MORE: PM Modi: హైదరాబాద్‌లో జీఎంఆర్ ఎయిర్పార్క్ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశానిది. ఇందులో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు 448 అధికకరణలు ఉన్నాయి. రాజ్యాంగం ఇంగ్లీషు ప్రతిలో దాదాపు 1,17,369 పదాలున్నాయి. ఇంగ్లీషు, హిందీ రెండు కాపీలు చేతితోనే రాశారు. హిందీ, ఇంగ్లీషులో రాసిన రాజ్యాంగం అసలు కాపీలు హీలియంతో నింపిన ప్రత్యేకమైన కేసుల్లో పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు. రాజ్యాంగ ప్రతులను ప్రేమ్ బిహరీ నారాయణ్ అనే వ్యక్తి ఇటాలిక్ శైలిలో అందంగా రాశారు. ఇందుకోసం ఆయన ఆరు నెలల సమయాన్ని వెచ్చించి దాదాపు 254 పాళీలు ఉపయోగించారు. ఇందుకు ప్రతిఫలంగా ఏమి తీసుకోని ప్రేమ్ బిహారీ.. కేవలం తన పేరును ప్రతిపేజీలో ఉండేలా కోరారు.
READ MORE: Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!
భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అన్న విషయం అందరికి తెలుసు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేసారు. ఆ సమయంలోనే వర్షంపడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు.
READ MORE: Champion : ‘ఛాంపియన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రోషన్–అనస్వర కెమిస్ట్రీ హైలైట్!
అదే రోజు అంటే 1950 జనవరి 26న గణతంత్ర భారత్‌కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్ నిర్వహించారు.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్‌లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!