Droupadi Murmu: ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను కొత్త అవకాశాలుగా మలచుకోవడానికి భారతదేశం తనకున్న అసాధారణ సామర్థ్యాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల్లో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతుల గమ్యస్థానాలు గణనీయంగా మారాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ (Nation First) అనే స్ఫూర్తితో ఈ మార్పును కొనసాగిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి EEPC కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు.
గుండె సమస్యలకు ఈ ఆహార పదార్దాలతో పూర్తిగా చెక్ పెట్టండి…
గత పదేళ్లలో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతులు 70 బిలియన్ల డాలర్స్ నుండి 115 బిలియన్ల డాలర్స్ కు పైగా పెరిగాయని ఆమె తెలిపారు. గత దశాబ్దంలో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. తక్కువ ధరలో అధిక నాణ్యత కలిగిన ఇంజినీరింగ్ సేవలు, ఉత్పత్తులు భారతదేశానికి గొప్ప బలం అని ఆమె అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కి, భారతీయ ఉత్పత్తిదారులకు మధ్య EEPC ఒక వారధిగా పనిచేసిందని ఆమె ప్రశంసించారు. ప్రపంచ విలువ గొలుసులో భారతదేశ పాత్రను నిరంతరం విస్తరించాలని ఆమె EEPCని కోరారు.
ప్రధాని మోడీ పుట్టిన రోజున ‘Swasth Nari Sashakt Parivar Abhiyaan’ ప్రారంభం.. వివరాలు ఇలా!
ప్రపంచ వాణిజ్య క్రమంలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా EEPC పాత్ర మరింత ముఖ్యమైనదని ముర్ము నొక్కి చెప్పారు. ఆర్థిక రంగంలో ఒక ముఖ్యమైన వాటాదారుగా EEPC మరింత సంకల్పంతో పనిచేయాలని ఆమె అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు భారతదేశంలో ఉన్నాయని, EEPC వంటి వాటాదారులు సరైన ప్రోత్సాహకాలు, అనుకూల వాతావరణాన్ని కల్పించి భారతదేశాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా మార్చాలనే ఆలోచనతో ముందుకు సాగాలని ముర్ము అన్నారు. ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అత్యంత పోటీతత్వంతో, సంపన్నంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఉన్న ప్రతిభ, శక్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి, భారతదేశాన్ని ఒక ప్రముఖ ఆవిష్కరణ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆమె EEPC వాటాదారులను కోరారు.
