National Sports and Adventure Awards: 2024 ఏడాదికి గాను క్రీడాకారులకు పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి
- రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమం
- ఘనంగా క్రీడాకారులకు పురస్కారాల ప్రదానం.
- ముఖ్య అతిధిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Sports and Adventure Awards: నేడు (జనవరి 17)న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ప్రముఖ క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, యూత్ చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ లకు కూడా దేశంలోని అత్యున్నత క్రీడా గౌరవం లభించింది. ఈ వార్షిక గౌరవాలకు ఎంపిక పాయింట్ల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పనితీరుపై గణనీయమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ కార్యక్రమం భారతీయ అథ్లెట్ల అద్భుతమైన ప్రతిభను, అంతర్జాతీయ వేదికపై వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది.
Also Read: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
ఈసారి అర్జున అవార్డ్స్ (లైఫ్‌టైమ్) ను సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్) లను అందుకున్నారు. అలాగే ద్రోణాచార్య అవార్డులను (కోచ్‌లు) సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సంగ్వాన్ (హాకీ) లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్‌టైం కేటగిరీలో మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్) పురస్కారాలను అందుకున్నారు. వీరితోపాటు మరో 32 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు.
Also Read: Off The Record: టీడీపీలో భారీ ప్రక్షాళన..! లోకేష్‌కు ప్రమోషన్..! సీనియర్లను పక్కన పెట్టేసినట్లేనా..?
ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్), అజీత్‌సింగ్ (పారా అథ్లెటిక్స్), సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్), ప్రణవ్ సూర్య (పారా అథ్లెటిక్స్), హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్), తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్), సుఖ్‌జీత్ సింగ్ (హాకీ), స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్), సరబ్‌జోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ (రెజ్లింగ్), రాకేశ్ కుమార్ (పారా ఆర్చర్), సలీమా (హాకీ), అభిషేక్ (హాకీ), సంజయ్ (హాకీ), జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), నిత్యశ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్), మనీశా రాందాస్ (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్ (పారా షూటింగ్), రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్), సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్), నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్ (పారా బ్యాడ్మింటన్), సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ రాజారాం పెట్కర్ (పారా స్విమ్మింగ్) లు అర్జున పురస్కారాలు అందుకున్నారు.
తాజావార్తలు
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!