Site icon NTV Telugu

Droupadi Murmu: బర్త్‌డే రోజు వేదికపైనే కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్..

Murmu

Murmu

ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ప్రస్తుతం ఆమె మూడు రోజుల డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. బర్త్‌డే సందర్భంగా ఆమె డెహ్రాడూన్‌లోని జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయం గడిపారు. దివ్యాంగ విద్యార్థులతో సంభాషించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, అతిథులను పలకరించారు. అధ్యక్షురాలు ముర్ము పుట్టినరోజు సందర్భంగా.. ఈ సంస్థ విద్యార్థులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రదర్శనను చూసిన ముర్ము భావోద్వేగానికి గురయ్యారు.

READ MORE: CM Omar Abdullah: ఉద్యోగ నియామకాల రిజర్వేషన్ అంశంపై విపక్షాలపై సీఎం ఆగ్రహం..!

అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము భావోద్వేగానికి గురవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఆమె వేదికపై కూర్చుని పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పాఠశాలలోని అంధ విద్యార్థులు ఆమె కోసం ఓ ప్రసిద్ధ బాలీవుడ్ పాటను పాడుతున్నారు. ఈ పాట విన్న రాష్ట్రపతి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “నా ప్రజా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణాల్లో ఇది ఒకటి. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి భారతదేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుంది.” అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

READ MORE: PM Modi: అంబేద్కర్‌ను మేము హృదయంలో పెట్టుకున్నాం.. మీరు పాదాల కింద పెట్టుకున్నారు..!

Exit mobile version