NTV Telugu Site icon

President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి

Murmu

Murmu

President Murmu Dance : సుందరమైన రాష్ట్రాల్లో సిక్కిం ఒకటని భారత రాష్ట్రపతి దౌపతి ముర్ము కితాబిచ్చారు. ఆమె ఇటీవల రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ రాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్ టక్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ గంగా ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం భార్యతో కలిసి రాష్ట్రపతి ముర్ము స్టేజిపై నృత్యం చేశారు. అనంతరం ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. అత్యంత సుందరమైన రాష్ట్రాలలో సిక్కిం ఒకటని చెప్పారు. మంచుతో నిండిన శిఖరాలు, అడవులతో వివిధ వర్గాల సంస్కృతులతో గొప్ప వారసత్వ సంపదను సిక్కిం కలిగి ఉందని పేర్కొన్నారు.

Read Also: Jabardasth Anchor Rashmi: జబర్దస్త్ నుంచి రష్మి ఔట్? ప్రోమోలో కొత్త యాంకర్!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా అక్కడి సర్కార్ ‘సమైక్య న‌ృత్యం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై కళాకారుల బృందం డ్యాన్స్ చేస్తుండగా.. కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ముర్ము నృత్యం చేశారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Read Also: Sudigali Sudheer – Rashmi: ఎక్కడికి వెళ్లినా రష్మీనే అడుగుతున్నారు

Show comments