Site icon NTV Telugu

President Droupadi Murmu: తొలిసారి కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu

President Droupadi Murmu

President Droupadi Murmu: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ పాల్గొన్నారు.

వారితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. కోటి దీపోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీప ప్రజ్వలన చేశారు. కోటి దీపోత్సవంలో పూరీ జగన్నాథునికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి రాష్ట్రపతి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి కార్తీక దీపాన్ని రాష్ట్రపతి వెలిగించారు.

 

Exit mobile version