NTV Telugu Site icon

President: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

President Draupadi Murmu

President Draupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆమె హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

Read Also: Health Tips : ఉదయాన్నే ఆమ్లెట్ ను ఇలా చేసుకొని తింటే..బరువు తగ్గడం ఖాయం ..!

అనంతరం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి ముర్ము బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు హకీంపేట్ వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ గేట్, లోత్‌కుంట ప్రాంతాల్లో వెహికిల్స్ కు పర్మిషన్ లేదని వెల్లడించారు. అటువైపుగా వెళ్లే వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

Read Also: Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

బొల్లారం, అల్వాల్, లోత్‌కుంట, త్రిముల్‌ఘేరి, కార్ఖానా, జేబీఎస్‌, ప్లాజా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్ రూట్లలో వచ్చే వాహనాలను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను హెచ్‌పీఎస్‌ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్ మోనప్ప జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు దారి మళ్లించనున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు.