BiggBoss 8 : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది వీళ్లే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే ?
- 12వారానికి చేరుకున్న బిగ్ బాస్
- డేంజర్ జోన్లో ప్రేరణల, యష్మీ, పృథ్వీ
- ఎలిమినేట్ అవకాశాలు యష్మీకే ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BiggBoss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రెండు మూడు వారాలు మాత్రమే కొనసాగనుంది. ప్రస్తుతం హౌస్‌లో కేవలం పది మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. సెప్టెంబర్ 2న హౌసులోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఐదుగురు ఎలిమినేట్ కాగా, అక్టోబర్ 6న ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా ఎలిమినేషన్లు జరుగుతున్నాయి. ఒక వారం డబుల్ ఎలిమినేషన్ అయితే గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఇంట్లో పది మంది మిగిలారు. వారిలో గౌతమ్, నిఖిల్, నబీల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, అవినాష్, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ ఉన్నారు.
వీరికి పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలిమినేట్ పర్వం కొనసాగింది. బిగ్ బాస్ తెలుగు ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్‌తో 12వ వారం నామినేషన్లు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ 8 తెలుగు వారం 12 నామినేషన్లలో ఐదుగురు నామినేట్ అయ్యారు. దీనితో, బిగ్ బాస్ 8 తెలుగు పన్నెండవ వారం నామినేషన్లలో నిఖిల్, ప్రేరణ, యష్మీ, పృథ్వీ, నబీల్ ఉన్నారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also:8 Sixes Off 8 Balls: క్రికెట్‌లో సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు!
ముఖ్యంగా యష్మీ, నిఖిల్, ప్రేరణలకు గ్రూప్ గేమ్ ఆడుతున్నారన్న అన్న ట్యాగ్ పడింది. ఎంత చెప్పినా ఎక్కడో ఒకచోట కలిసి ఆడుతున్నట్లుగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. దీన్నే హైలెట్ చేస్తూ టైటిల్ రేసులో నిఖిల్ దగ్గరికి గౌతమ్ వచ్చాడు. అయితే ఈ వారం నామినేట్ అయిన వారిలో నిఖిల్, నబీల్ లకు ఎలాంటి ప్రమాదం లేదు. వీరిద్దరూ మంచి ఓటింగ్‌తో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రేరణల, యష్మీ, పృద్వీల మధ్య ఎలిమినేషన్ ఫైట్ జరగనుంది. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పృధ్వీ, యష్మీలు రిస్క్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండూ కాకపోతే ప్రేరణలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ప్రేరణ గేమ్ బాగా ఆడుతుంది కానీ అవతలి వ్యక్తిని విమర్శించడంలో కొంత నెగెటివిటీ తెచ్చింది.
ప్రేరణ ఇప్పటి వరకు టాప్ 5లో చేరడం ఖాయమని భావించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె ప్రవర్తన హౌస్‌మేట్స్‌నే కాకుండా ప్రేక్షకులను కూడా షాక్ చేస్తుంది. ఈ కారణాలతో ఆమె డేంజర్ జోన్‌లో ఉంది. ఇక పృథ్వీ విషయానికొస్తే.. టాస్క్‌లు తప్ప హౌస్‌లో పెద్దగా కలవడని, ఒకరిద్దరు వ్యక్తులతో సన్నిహితంగా ఉంటాడన్న టాక్ వినిపిస్తుంది. ఇక మొదట్లో చాలా ఫైర్‌తో ఆడిన యష్మీ.. తర్వాత నిఖిల్‌తో కలిసి సైడ్‌ట్రాక్‌లోకి పోయింది. అయితే ఈ వారం ఎక్కువ రిస్క్ లో ఉన్నది యష్మీకే అని తెలుస్తోంది. మరి ప్రేక్షకుల ఓట్లు ఎవరిని కాపాడతాయో, ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి.
Read Also:Supreme Court: అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా..!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!