Site icon NTV Telugu

Premendar Reddy : విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Premendar Reddy

Premendar Reddy

కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నీళ్ళ మూటలు అని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, ఉచిత ఎరువులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యం లో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ధాన్యం సేకరణ విషయంలో దళారీ పాత్ర కూడా సరిగా నిర్వహించలేని ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు. బీజేపీ నీ దెబ్బ కొట్టాలనే కుట్ర జరుగుతోందని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కలిసి ఇదంతా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్న పార్టీలు కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌లు అని ఆయన దుయ్యబట్టారు.

Heavy rains: దేశవ్యాప్తంగా మరో నాలుగైదు రోజుల పాటు భారీగా వర్షాలు..
ఇదిలా ఉంటే.. రేపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నేతలు హాజరు కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయాలు బీజేపీ భవిష్యత్తు ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో పాటు నూతన కమిటీ ఏర్పాటుపై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కమిటీలను వాటి నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికార పార్టీని టార్గెట్‌గానే వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్న బీజేపీ అదిష్టానం.. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Jaanavule Lyrical Video: తమన్ ‘జాణవులే’ అంటుంటే బాగుంది ‘బ్రో’!

Exit mobile version