Viral Video: ప్రతిరోజు వైరల్ వీడియోలు మన జీవితాల్లో భాగంగా మారిపోయాయి. ప్రతీ రోజు ఎన్నో వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ, కొన్ని వీడియోలు మాత్రం వినూత్నతతో, భావోద్వేగంతో, లేదా ఆశ్చర్యం కలిగించే అంశంతో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో డాక్టర్ సోనమ్ దయాహ్ అనే గర్భిణి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. డాక్టర్‌గా పని చేసే సోనమ్ గర్భం దాల్చిన తర్వాత తనకు కవలలు పెరుగుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. సాధారణంగా గర్భవతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. కానీ సోనమ్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సంపూర్ణ ఉత్సాహంతో జీవిస్తోంది.
Read Also: Youtube Delivery: యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రియురాలికి డెలివరీ చేసిన ప్రియుడు..!
సోనమ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అదిల్ ఖాన్‌తో కలిసి “డింగ్ డాంగ్ డింగ్” అనే పాపులర్ పాటకు మాస్ స్టెప్పులేసింది. ఈ డాన్స్ వీడియోలో ఆమె డ్రెస్, హావభావాలు, స్టెప్పులన్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు నెటిజన్లు ఇది ప్రమాదకరమై ఉండవచ్చని హెచ్చరిస్తుండగా, మరికొందరు మాత్రం అదరగొట్టారు అంటూ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సోనమ్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. సోషల్ మీడియాలో ఆమెపై పాజిటివ్ కామెంట్ల వర్షం కురుస్తోంది. డాక్టర్‌గా ఉన్న ఆమె ఎలాంటి సవాలు ఎదురతాయో తెలుసు కాబట్టి ధైర్యంగా ఎదురుకుందెకు సిద్ధమైంది.
Is this safe for the child in womb?pic.twitter.com/BZvoWdUCIr
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 5, 2025