NTV Telugu Site icon

Pregnancy Women : కడుపునొప్పితో వచ్చిన గర్భవతి.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో

Tamilnadu Dead Man Wakes Up

Tamilnadu Dead Man Wakes Up

కీసర గ్రామానికి చెందిన రాధిక పెళ్లి అయి ఒక్క సంవత్సరం అయింది. రాధిక గర్భవతి కావడంతో స్థానిక హాస్పిటల్ అయిన నితిన్ హాస్పిటల్ లో గత కొన్ని నెలల నుండి చికిత్స చేయించుకుంటుంది. ఎనిమిది నెలల గర్భవతి అయిన రాధిక వారం రోజుల క్రింద నితిన్ హాస్పిటల్ చెకప్ చేయించుకుంది. రాధిక వారం రోజుల క్రితం తల్లి ఊరు తుంకుంటా ఇంటికి వెళ్లగా అక్కడ తనకు కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది అని భువనగిరిలోని ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకోగా వారు గాంధీ హాస్పిటల్ కి సిఫార్సు చేశారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు రాధిక చనిపోయింది. రాధిక మృతికి కారణం కీసర నితిన్ హాస్పిటల్ లో సరైన చికిత్స చేయకపోవడమే అని.. ఆమె బంధువులు నితిన్ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగి హాస్పిటల్ అద్దాలు పగుల గొట్టారు. గర్భవతి అయినా రాధిక జండిస్ తో బాధపడుతుంటే.. నితిన్ హాస్పిటల్ డాక్టర్లు ఎటువంటి పరీక్షలు చేయకుండా ఉదయం 6 గంటల సమయం నుండి సాయంత్రం 6 గంటల వరకు సెలైన్‌ బాటిల్ ఎక్కించడంతో కడుపులో ఉన్న బేబీకి హాని ఆవడం తో బేబీ గర్భం లోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read : Subbarami Reddy : తెలుగు వారికి పద్మశ్రీ రాదు.. అంతా తమిళ్.. వేరే వాళ్ళకే

తల్లితో పాటు గర్భంలో ఉన్న బేబీ మృతి చెందడంతో.. నితిన్‌ ఆసుపత్రి డాక్టర్లు వారికి కేవలం 4లక్షల నష్టపరిహారం ఇచ్చి సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం దానికి ఒప్పుకోకుండా బైటికి రావడం చర్చనీయంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు వారికి న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. హాస్పిటల్ సిబ్బంది సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు.. ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులను, స్థానిక ప్రజలను అక్కడి నుండి పంపించారు.

Show comments