Pre Launch Scam : హైద్రాబాద్‌లో ఆగని ప్రీ లాంఛ్ మోసాల పరంపర.. మరొకటి వెలుగులోకి
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు
- బయటపడ్డ మరో ప్రీ లాంఛ్ మోసం
- ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసిన క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pre Launch Scam : హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో..! లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో..! ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్. నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ తమ ఫ్లాట్స్ ఎక్కడా..? అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. క్రితికా ఇన్ ఫ్రా తీరుతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.
Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
నిర్మాణ రంగంలో ఏమున్నా.. లేకపోయినా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలా ముఖ్యం. కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. ప్రీ లాంఛ్ ఆఫర్లు.. బై బ్యాక్ సేల్స్ అంటూ మోసం చేస్తుండటంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డున పడుతున్నారు. ఎప్పుడో ఒకసారి జరిగితే ఏమోలే అనుకోవచ్చు గానీ నెలలో రెండు లేదా వారం-పది రోజులకో కంపెనీ బిచాణా ఎత్తేయడం మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమే. లేటెస్ట్గా ప్రీ లాంఛ్ ఆఫర్ల పేరుతో మోసం చేసింది క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్. డబ్బులు కట్టించుకోని సంవత్సరాలు దాటినా- ఇప్పటివరకు తమ ఫ్లాట్స్‌ను తమకివ్వలేదంటూ కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు.
2020లో ప్రీ లాంఛ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు క్రితికా ఇన్ఫ్రా నిర్వాహకులు. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్ఫ్రాకు రాధా భూక్యా ఎండీ కాగా.. డైరెక్టర్‌గా ధూమవాత్ గోపాల్.. సీఈవోగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో ఎస్+6 అపార్ట్మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంఛ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్‌లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తామని హ్యాండిచ్చారు. ప్రీ లాంఛ్ పేరుతో దాదాపు 150 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు నిర్వాహకులు. ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా.. బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రితికా ఇన్ ఫ్రా తమని మోసం చేస్తుందని గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకొన్న యాజమాన్యం.. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని వాపోతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.
Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్లోనే కుప్పకూలిన చిన్నారి..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!