కృష్ణా జిల్లా పామర్రు (మ) జమీ గొల్వేపల్లి లో K. V. S. M జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. జిల్లాలో నాడు – నేడు కార్యక్రమం సక్రమంగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. తరగతి గదుల్లో విద్యుత్ పనులు చేపట్టకపోవడంతో అధికారిపై ఫైర్ అయ్యారు కమిషనర్.
Read Also: Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
ప్రాధాన్యత లేని పనులకు ముందు చేయడం… అత్యవసర పనులు జాప్యంపై విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ సీరియస్ అయ్యారు. వంట షెడ్డు నిర్మించి.. టాయిలెట్స్ నిర్మాణం చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులన్నీ కూడా మేమే చేసుకుంటాం అన్నారు కమిషనర్ విద్యాశాఖ కమిషనర్. శిథిలావస్థలో ఉన్న స్కూలు చూసి నమస్కారం పెట్టారు కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అధికారులకు ముచ్చెమటలు పట్టించారు విద్యాశాఖ కమిషనర్. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అప్రజిత సింగ్, డీఈవో తాహెరా సుల్తానా కమిషనర్ వెంట వున్నారు.
Read Also: Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
