ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అహంకారి, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్ గా లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తాలిబన్ సంస్కృతికి వారసుడిలా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో రేవంత్ రెడ్డి డీకే అరుణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, మంత్రిగా పని చేసిన సునీతా లక్ష్మారెడ్డి పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరమని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం అసహ్యించుకుంటోందని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు ప్రశాంత్ రెడ్డి. కేవలం రెండు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమంటే కూడా ఇవ్వని పరిస్థితి అని, స్పీకర్ కి సమయం ఇవ్వాలని ఉన్నప్పటికీ సిఎం రేవంత్ రెడ్డి నుంచి వస్తున్న ఇన్స్ట్రెక్షన్ వల్ల ఇవ్వలేదు అని అనుకుంటున్నామన్నారు. మహిళ ఎమ్మెల్యేలను రెండున్నర గంటలు నిలబెట్టారని, మమ్మల్ని మార్షల్స్ తో బయటకు పంపి… మమ్మల్ని తెలంగాణ భవన్ లో పోలీసు వాహనంలో డ్రాప్ చేశారన్నారు. మా మహిళా శాసనసభ్యుల ఉసురు మీకు తగులుతుంది రేవంత్ అని ఆయన అన్నారు.
Devineni Uma: ప్రజా సమస్యను తీర్చేందుకు టీడీపీ-జనసేన- బీజేపీలు కృషి చేస్తున్నాయి..
అంతేకాకుండా.. ‘స్పీకర్ మాకు అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇవ్వలేదు.. మా పట్ల ప్రభుత్వం ఫ్యూడల్ గా వ్యవహరించింది.. రేవంత్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుంది.. రాజకీయాల్లో, పోరాట పటిమలో కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది 36 పార్టీలను కేసీఆర్ ఒప్పించి తెలంగాణ సాధించారు.. 2009 లో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు వలనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.. ఆ విషయాన్ని మర్చిపోవద్దు.. తెలంగాణ కోసం కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి, ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి పారిపోయారు.. రేవంత్ రెడ్డి పూటకో పార్టీ మారారు.. రేవంత్ రెడ్డి అపరిచితుడులాగా వ్యవహరిస్తున్నారు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. భాష విషయంలో చాలా దారుణంగా ఉంటోంది.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది.. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు..’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
National Girlfriends Day 2024: జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?