Site icon NTV Telugu

Prashant Kishore: ఆ సీఎంకు చదువు రాదు.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఘాటు వ్యాఖ్యలు

Prasha

Prasha

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కు మధ్య విబేధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే . చాలా సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ బీహార్ సీఎంపై విమర్శలు చేశారు. తాజాగా మరోసారి నితీశ్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిశోర్. నితీశ్‌ కుమార్‌ కేవలం 9వ తరగతి మాత్రమే చదివారన్నారు పీకే. ఇక ముందూ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు బాధ్యత గల సీఎం పదవిలో ఉండి కూడా బీహార్‌లో నిరక్షరాస్యత మరింత పెరగాలని కోరుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: Robert Vadra: ప్రియాంకా గాంధీపై భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు

నిరక్షరాస్యులైతే చదువురాని తనకే ఓట్లేస్తారనేది నితీశ్‌ ఆలోచన అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి నితిశ్ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, బీహార్ కూలీల రాష్ట్రంగా మారిపోవడానికి నితిశ్ కుమారే కారణమని మండిపడ్డారు. ఆయనకు అనేక విషయాలపై అవగాహన తక్కువని కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రశ్నించండని మీడియా ప్రతినిధులకు సూచించారు. ఆయన తప్పకుండా దానికి సమాధానాన్ని దాటవేస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.

 

 

 

Exit mobile version