Site icon NTV Telugu

Prabhas Prashanth Varma : ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ.. పోస్టర్ కూడా రెడీ చేశాడట ?

Prabhas Prashanth

Prabhas Prashanth

Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్‌, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఎలాగూ సలార్ 2, కల్కి 2 లైన్లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే.. ఊహించని పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రశాంత్.. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఙను లాంచ్ చేసే పనిలో ఉన్నాడు.

Read Also:Astrology: నవంబర్ 18, సోమవారం దినఫలాలు

అలాగే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జై హనుమాన్‌తో పాటు మహాకాళీ, అధీరా లాంటి సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ వర్మ రీసెంట్ స్టేట్ మెంట్ ఒకటి ఇపుడు ఊపందుకుంది. తాను ఒక బిగ్గెస్ట్ స్టార్ తో వర్క్ చేస్తున్నానని ఆల్రెడీ అతడితో ఓ పోస్టర్ వర్క్ ని కూడా పూర్తి చేశానంటూ చెప్పుకొచ్చాడు. దీనితో ఆ బిగ్ స్టార్ ప్రభాస్ నే కావచ్చని ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కలయిక కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ బిగ్ స్టార్ ప్రభాసేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం తాను కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో “జై హనుమాన్” అనే సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also:Puspa 2 Trailer: ‘పుష్ప’ గాడి అరాచకం.. రికార్డులు సృష్టిస్తున్న ట్రైలర్

Exit mobile version