ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలలో హనుమాన్ కూడా ఒకటి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించింది.. భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే జోరు తగ్గలేదు.. ఇంకా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.. ఇక ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు..
సినిమా ఇంత సక్సెస్ ను అందుకోవడానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ముఖ్య కారణం అని చెప్పాలి.. ఈయన సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. పలు షార్ట్ ఫిల్మ్స్‌తో నిరూపించుకున్న ఇతడు.. హీరో నాని నిర్మించిన ‘అ!’ మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి.. ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ లాంటి చిత్రాలతో భారీ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సినిమా హనుమాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..
అదేంటంటే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సాఫ్ట్ వేర్, చిత్ర డైరెక్టర్ మాత్రమే కాదు.. ఒక క్రీడా కారుడు కూడా.. స్కూల్, కాలేజీ లెవెల్స్ నుంచి ప్రశాంత్ క్రికెట్ ఆడుతూ వచ్చాడు. డిస్ట్రిక్ లెవల్ లో పలు కప్పులు గెలుచుకున్నాడు. పలు ప్రైవేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడి ప్రశాంత్ వర్మ క్రికెటర్ గా కూడా సక్సెస్ అయి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రశాంత్ బ్యాట్స్ మెన్, బౌలర్ కూడా. పలు టోర్నమెంట్స్ లో కూడా ఆడి ఎన్నో అవార్డులను అందుకున్నారు.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా ఆడాడు ప్రశాంత్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ క్రికెట్ ప్రాక్టీస్ ను మొదలు పెట్టారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..