Site icon NTV Telugu

Prasanth Varma : రణ్ వీర్ తో సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ..?

Prashanth Varms

Prashanth Varms

Prasanth Varma : టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.కల్కి ,జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది “హనుమాన్” సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు.టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది.హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

హనుమాన్ సినిమా సంచలన విజయం సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ను కూడా ప్రకటించాడు.రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్‌కి పూజ కూడా నిర్వహించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. ఇదిలావుంటే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌సింగ్‌ని ప్రశాంత్ వర్మ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సినిమా మొదలైందని ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ కూడా జరుగుతుందనేది విశ్వసనీయ సమాచారం.అయితే ఈ షూటింగ్ కి సంబంధించి  ఇంట్రెస్టింగ్  గ్లింప్స్‌ని త్వరలోనే రిలీజ్‌ చేస్తారని సమాచారం.

Exit mobile version