పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ సాధించిన హను-మాన్ డైరెక్టర్ ప్రశాంతర్మ తాజాగా ఓ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హను-మాన్ సినిమాని అందించిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో వారి తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ‘బలగం’, ‘ఓం భీమ్ బుష్’, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. ఇక ఈ చిత్రంలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ ‘నభా నటేష్’ హీరోయిన్ గా నటించనుంది. రొమ్ – కామ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అంటూ ఓ ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ ను కూడా పెట్టారు.
Also read: Manipur : మణిపూర్‌లోని 11 పోలింగ్ స్టేషన్లలో ఏప్రిల్ 22న రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశాలు
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “మన హీరో ప్రియదర్శితో తనకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెబుతూ.. దర్శకుడిగా తన తొలి షాట్ దర్శి మీదే చేసానని తెలిపాడు. దర్శి నా మొదటి హీరో అంటూ చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఈ కార్యక్రమానికి అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉందని.. తాను నిర్మాత నిరంజన్ గారితో మూడేళ్ళుగా జర్నీ చేస్తున్ననని., ఆయన చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాత అంటూ తెలిపాడు. ఆయన మంచి కథ ఎక్కడున్నా వింటారని.. హను-మాన్ లాంటి ఓ పెద్ద సినిమాని తీసే అవకాశం ఇచ్చిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హను – మాన్ విడుదలకు సిద్ధమౌతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు అంటూ ఆయన మాట్లాడారు.
Also read: Jersey: గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని పోస్ట్ వైరల్..
ఇకపోతే ఈ సినిమాలో అనన్య నాగళ్ల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. నరేష్ డీవోపీగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి హేమంత్ డైలాగ్స్ రాయగా., ప్రదీప్ రాఘవ్ ఈ చిత్రానికి ఎడిటర్ గా, గాంధీ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.