NTV Telugu Site icon

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

Mokshagna

Mokshagna

Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్‌ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్‌ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకుడిగా రూపొందబోయే ఈ ఫాంటసీ సోషల్‌ డ్రామాను పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో షూట్స్ కంప్లీట్ అయ్యాయి.. అవి బయటికి కూడా వచ్చాయి.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. అందులో.. మోక్షు లుక్‌, కటౌట్ అదిరిపోయింది. శాంపిల్‌ లుక్స్‌ను సోషల్‌ మీడియాలో వదిలాక మంచి స్పందన వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఙ లుక్‌కు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read Also: Spirit-Prabhas: స్పిరిట్‌లో ఊహించని సర్‌ప్రైజ్‌.. బాక్సాఫీస్‌ను ఆ దేవుడే కాపాడాలి?

ఇక మొన్నటి వరకు.. మోక్షజ్ఙ సినిమా ఎవరితో ఉంటుంది? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి సబ్జెక్ట్‌తో లాంచ్ అవుతున్నాడు? అనే సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసినట్టే. మోక్షజ్ఙను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నాడు. ఆహా అన్ స్టాపబుల్ ద్వారా బాలయ్యతో ట్రావెల్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ మధ్యలో బాలయ్యనే ఈ యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా.. మోక్షజ్ఙ లాంచింగ్‌ను ప్రశాంత్ వర్మకు అప్పజెప్పినట్టుగా తెలిసింది. హనుమాన్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఙతో ఫాంటసీ సోషల్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే సందేహానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని చెప్పాలి. మోక్షజ్ఙ ఎంట్రీకి దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలుపెడతారని సమాచారం. అయితే.. ఇలాంటి విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

Show comments