Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
- నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం
- మోక్షజ్ఞను లాంచ్ చేయబోతున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా రూపొందబోయే ఈ ఫాంటసీ సోషల్ డ్రామాను పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటో షూట్స్ కంప్లీట్ అయ్యాయి.. అవి బయటికి కూడా వచ్చాయి.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. అందులో.. మోక్షు లుక్, కటౌట్ అదిరిపోయింది. శాంపిల్ లుక్స్‌ను సోషల్ మీడియాలో వదిలాక మంచి స్పందన వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఙ లుక్‌కు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Also: Spirit-Prabhas: స్పిరిట్‌లో ఊహించని సర్‌ప్రైజ్.. బాక్సాఫీస్‌ను ఆ దేవుడే కాపాడాలి?
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఇక మొన్నటి వరకు.. మోక్షజ్ఙ సినిమా ఎవరితో ఉంటుంది? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి సబ్జెక్ట్‌తో లాంచ్ అవుతున్నాడు? అనే సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసినట్టే. మోక్షజ్ఙను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నాడు. ఆహా అన్ స్టాపబుల్ ద్వారా బాలయ్యతో ట్రావెల్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ మధ్యలో బాలయ్యనే ఈ యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా.. మోక్షజ్ఙ లాంచింగ్‌ను ప్రశాంత్ వర్మకు అప్పజెప్పినట్టుగా తెలిసింది. హనుమాన్‌తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఙతో ఫాంటసీ సోషల్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనే సందేహానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని చెప్పాలి. మోక్షజ్ఙ ఎంట్రీకి దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలుపెడతారని సమాచారం. అయితే.. ఇలాంటి విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!