టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాన్సెప్ట్డ్ బేస్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు..రీసెంట్ గా సుహాస్ నటించిన “అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్” సినిమాతో సుహాస్ సూపర్ హిట్ అందుకున్నాడు.ఆ సినిమాలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్న వదనం. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోషియేటివ్ డైరెక్టర్ గా వున్న అర్జున్ వైకే తెరకెక్కించారు. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత మరియు నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రలలో నటించారు.అలాగే బేబీ మూవీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా జెఎస్ మణికంఠ మరియు టిఆర్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా శుక్రవారం (మే 3న) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్ ఫికైనట్లుగా ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి అయిన వెంటనే ఆహాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.