Site icon NTV Telugu

Varshangalkku Shesham OTT: ఓటీటీలో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Varshangalkku Shesham Ott

Varshangalkku Shesham Ott

Varshangalkku Shesham Movie OTT Release Date: ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్‌లు ఖాతాలో వేసుకుంది. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రేమలు, మంజుమ్మెల్‌ బాయ్స్‌, భ్రమయుగం, ఆవేశం, ఆడుజీవితం వంటి చిత్రాలు హిట్ కొట్టాయి. ఈ సినిమాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలు, మంజుమ్మెల్‌ బాయ్స్‌ సినిమాలకు ఫాన్స్ ఫిదా అయ్యారు. తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగులో విడుదలకు సిద్దమైంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‍లాల్ నటించిన సినిమా ‘వర్షంగల్కు శేషం’. డైరెక్టర్‌ వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 11వ రిలీజై బాక్సాఫీస్ భారీ హిట్ కొట్టింది. ఘన విజయం సాధించడంతో ఈ సినిమా ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వస్తోంది. జూన్ 7న ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో వర్షంగల్కు శేషం స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో కూడా ఈ చిత్రం అదే రోజున విడుదల అవుతుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్‌ విడుదల చేసింది.

Also Read: Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజూకు మరో ఆఫర్.. హీరో ఎవరంటే?

కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వర్షంగల్కు శేషం బాక్సాఫీస్‌ వద్ద రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఒకరు డైరెక్టర్ కావాలని.. మరొకరు సంగీత దర్శకుడు కావాలని ప్రయత్నిస్తారు. మరి ఆ స్నేహితులు ఇద్దరు తమ లక్ష్యాలను నెరవేర్చుకున్నారా?, వారికి ఎదురైనా సవాళ్లు ఏంటి అనేది డైరెక్టర్ బాగా చూపించారు. ఎమోషనల్ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.

Exit mobile version